23 June, 2026 | 7:04 AM

చవితి రోజు భలే ఉన్నాడే

16-08-2024 01:23 AM

రాజ్‌తరుణ్ హీరోగా నటించిన మరో చిత్రం విడుదలకు సిద్ధమైంది. ‘భలే ఉన్నాడే’ పేరుతో తెరకెక్కిన ఆ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం గురువా రం ప్రకటించింది. జె.శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్‌చంద్ర సంగీతం సమకూరుస్తుండగా, నగేశ్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్నారు. మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ తదితరులు ఈ చిత్రంలో మిగతా తారాగణం.