12-07-2025 12:00:00 AM
ఐవీ మురళీకృష్ణ శర్మ :
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా అన్ని రంగాల్లో ప్రగతిపథంలో సాగాలంటే పెట్టుబడులను భారీగా ఆకర్షించా ల్సిన ఆవశ్యకత ఉంది. భారీ పెట్టుబడులతో రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేయాల ని కంకణం కట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పా టు పెట్టుబడిదారులకు రాష్ర్టంలో అనుకూల వాతావరణం కల్పించింది.
పెట్టుబడి దారులకు సౌకర్యాలు కల్పిస్తూ రాష్ర్ట ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుండటంతో ప్రధానంగా ఐటీ రంగానికి తెలం గాణ కేరాఫ్‌గా మారింది. తెలంగాణ ప్రభు త్వం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మకంగా తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రం పెట్టుబడిదారులకు స్వర్గధా మంగా మారింది.
రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం ‘తెలంగాణ రైజింగ్-- 2047’ పేరుతో వందేళ్లకు అవసరమైన ప్రణాళికలు రూ పొందిస్తుండటంతో భవిష్యత్‌లో తెలంగాణ భారీ పెట్టుబడులకు సోపానంగా మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏడాదిన్నరలో 9.8 శాతం వృద్ధి రేటు సాధించిన తెలంగాణ ప్రభుత్వం ఆశావహదృక్పథంతో రెండంకెల వృద్ధి సాధిస్తామ నే విశ్వాసంతో ఉంది.
బలమైన ఆర్థిక పునాదులుంటేనే రాష్ర్టం అభివృద్ధి పథం లో కొనసాగుతుందనే దూరదృష్టితో సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తీవ్ర కృషి చేస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమల ఏ ర్పాటుకు భారీగా పెట్టుబడులు రావాలనే సంకల్పంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
పెట్టుబడులతో రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడంతోపాటు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెంచాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టంలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల చర్యలు చేపట్టింది. ప్రపంచంలోని మేటి సౌకర్యాలున్న నగరాలతో పోటీపడేలా హైదరా బాద్ శివార్లలో 30 వేల ఎకరాల్లో ఫ్యూచ ర్ సిటీని ఏర్పాటు చేస్తుండటంతో తెలంగాణలో పెట్టుబడులకు అదనపు బలం చేకూరింది.
ఫ్యూచర్ సిటీతో పాటు యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటు, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం, గ్రేటర్ నలువైపులా మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలు కూడా పెట్టుబడుదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానం కూడా పారిశ్రామికవేత్తల ను ఆకర్షించిందనే చెప్పాలి.
ప్రభుత్వ చర్య లు ఫలించడంతో జనవరిలో దావోస్ వేదికపై రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో ప్రపంచంలోని పలు ఐటీ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో తమ కంపెనీలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి.
అలుపెరుగని కృషి..
తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్‌గా మార్చాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఐటీ శ్రీధర్‌బాబు కృషి చేస్తున్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) వార్షిక సదస్సులో తెలంగాణ మరోమారు సత్తా చాటింది. ఐటీ, ఎనర్జీ, సోలార్, ఎయిర్‌స్పేస్, మౌలిక సదుపాయాల కల్పన, ఫా ర్మా, హెల్త్ రంగాలకు చెందిన పలు ప్రము ఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడుల కో సం ఆసక్తి కనబరియాయి.
దావోస్ పర్యటన అనంతరం పెట్టుబడులపై ప్రభుత్వానికి విశ్వాసం పెరగడంతో రాష్ట్రం లో పరిశ్రమల స్థాపనలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘పారిశ్రామిక విధానం- -2025’ రూపొందిస్తున్నది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు 4 వేలకుపైగా దరఖా స్తులు రాగా.. ఆ దరఖాస్తులపై కాలయాపన చేయకుండా సింగి ల్ విండో విధానం లో వాటిని పరిష్కరిస్తున్నది.
కేవలం 15 రోజుల వ్యవధిలో 98 శాతం యూనిట్లకు అనుమతులు మంజూరు చేసింది. పరిశ్రమల పెట్టుబడుల కారణంగా రాష్ట్రం ఆర్థి కంగా అభివృద్ధి సాధిస్తున్నది. అంతేకాక.. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పరిశ్రమల రాకతో రియల్ ఎస్టేట్ రంగం కూడా పుంజుకుంటున్నది. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు వచ్చాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ కొలువులు భర్తీ చేసింది. మరోవైపు పెట్టుబడులను సైతం ఆహ్వానిస్తూ, యువతకు ఉపాధి మార్గాలకు బాటలు వేస్తున్నది. పెట్టుబడుల్లో సాఫ్ట్‌వేర్ రంగానికి చెందిన పెట్టుబడులే అధికం. సాంకేతిక రంగానికి కీలకంగా మారిన గ్రేటర్ హైదరాబాద్‌కు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు క్యూ కట్టాయి.
బెంగళూరు, పూణె, గుర్గావ్ నగరాలను వెనక్కునెట్టి మరీ హైదరాబాద్ ‘గ్లోబల్ ఐటీ హబ్’గా అవతరించింది. ప్రపంచంలో పేరెన్నికగన్న ప్రముఖ టెక్ సంస్థలు నేడు నగరంలో కొలువుదీరాయి. 2023--24లో దేశంలో ఐటీ ఎగుమతుల విలువ రూ.9.43 లక్షల కోట్లు కాగా, ఇందులో రాష్ట్ర వాటా రూ. 2.7 లక్షల కోట్లు కావడం విశేషం. 2022--23 సంవత్సరంతో పోలిస్తే 2023--24లో తెలంగాణ ఐటీ రంగంలో 11.3 శాతం వృద్ధి సాధించింది.
ఇది దేశ సగటు కంటే నాలుగింతలు అధికం. ఇక్కడ ఐటీ రంగం లో 10 లక్షల మందికి పైగా ఉపాధి పొం దుతున్నారు. రాజధాని హైదరాబాద్‌లో 1500కు పైగా ఐటీ కంపెనీలున్నాయి. ప్రపంచంలో అత్యుత్తమ 10 కంపెనీల్లో 7 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. మై క్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, సేల్స్ ఫోర్స్ కంపెనీలకు నగరంలో కార్యాలయాలున్నాయి.
దావోస్‌లో కుదిరిన రూ.1.78 లక్షల పెట్టుబడుల ఎంవోయూలలో రూ.1.04 లక్షల కోట్లు ఐటీ, డేటా సెంటర్లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లకు సంబంధించినవే. గూగుల్ సంస్థ భారత్‌లో మొ దటి సేఫ్టీ ఇంజినీరింగ్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించడం రాష్ట్రానికే గర్వకా రణం. సాంకేతిక రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండటంతో 2023-24లో 40 వేల మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ వర్సిటీ
తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్రంలో ఏఐ వర్సిటీని నెలకొల్పుతున్నది. వర్సిటీ ద్వారా రెండేళ్ల్లలో 2 లక్షల మందిని ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యం పెట్టుకున్నది. దీనిలో భాగంగానే దేశంలో తొలి ఏఐ ఎక్స్ఛేంజ్ ‘తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్’ (టీజీడెక్స్)ను ప్రారంభించింది. ఏఐ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని తెలంగాణను ‘గ్లోబ ల్ క్యాపిటల్ ఆఫ్ ఏఐ’గా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ రూపొందించింది.
ఏఐని సమర్థంగా వినియోగించుకునేందుకు టీజీ డెక్స్‌లో భాగంగా జెకా సహకారంతో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందుబాటు లోకి తెచ్చింది. ఇది ప్రభుత్వ శాఖలు, స్టార్టప్స్, విద్యా సంస్థలు, పరిశోధకులు, యువతకు విశేషంగా తోడ్పడుతున్నది. టీజీ డెక్స్ ద్వారా రైతులకు సంబంధించిన అగ్రిటెక్ స్టార్టప్స్‌కు డేటా అందుతోంది. ఏఐకి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం రానున్న ఐదేండ్ల్లలో 2 వేల డేటా సెంటర్లను ఏర్పా టు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాలకు విస్తరింపజేస్తున్నది. రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలు కూడా ఐటీ రంగంలో సమస్థాయిలో అభివృద్ధి చెందాల పట్టుదలతో ప్రభుత్వం ఉంది. దీనిలో భాగంగానే దూరదృష్టితో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, షాద్‌గర్ వంటి పట్టణాల్లో, నగరాల్లోనూ ఐటీ రంగాన్ని విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నది.
షాద్‌నగర్‌లో రూ.16 వేల కోట్లతో డేటా క్లస్టర్ నిర్మించేందుకు ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రాన్ని ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహలు ఇచ్చేందుకు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్లకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు మరిం త ఉత్సాహానిస్తున్నాయి.