21-07-2025 12:19:49 PM
సినిమా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు
సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు
హైదరాబాద్: సినిమా బతకాలని మేమంతా కోరుకుంటాం.. సినిమా నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... నిర్మాత ఎ.ఎం రత్నం(A. M. Rathnam) సినిమాను ఉన్నతస్థాయికి తీసుకెళ్లారని పవన్ వెల్లడించారు. సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదన్నారు. సినిమా గురించి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదని తెలిపారు. ఎ.ఎం రత్నం గురించే ఈ ప్రెస్ మీట్ పెట్టామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ గొప్పతనాన్ని ఎ.ఎం రత్నం ప్రపంచానికి చాటిచెప్పారని సూచించారు. హరిహరవీరమల్లు(Hari Hara Veera Mallu) క్లైమాక్స్ సీన్ కోసం 57 రోజులు షూటింగ్ చేశామని చెప్పిన పవన్ కళ్యాణ్ తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ సినిమాకు పనికి వచ్చాయని వెల్లడించారు. సినిమాను అనాథగా వదిలేయలేదని, అండగా ఉన్నానని చెప్పేందుకు వచ్చానని తెలిపారు. కరోనా సహా ఎన్నో ఇబ్బందులు ఈ సినిమా నిర్మాణంలో వచ్చాయన్నారు. హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ కళ్యాణ్ తో నటించడం చాలా ఉత్సాహంగా ఉందని హరోయిన్ నిధి అగర్వాల్ అన్నారు.