ప్రాణవాయువును సృష్టించేది చెట్లే
జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ
జమ్మికుంట జూన్ 3 (విజయక్రాంతి): విశ్వంలో మనిషిని బ్రతికించే ప్రాణవాయువును సృష్టించే గొప్ప శక్తి చెట్లకే ఉందని, ప్రతి ఒక్కరు విధిగా వనాలను పరిరక్షించాలని కరీంనగర్ జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు.
జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి భవన్లో బుధవారం ప్రజా పాలన_ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ అటవీ శాఖ రేంజ్ అధికారిని లత ఆధ్వర్యంలో పర్యావరణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరీంనగర్ జిల్లా అటవీశాఖ అధికారి, మున్సిపల్ చైర్మ న్ ములుగు ప్రశాంత్ కుమార్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి మాట్లాడుతూ.... ప్రాణవాయువు ఉంటేనే మనిషి బ్రతుకుతాడని, ప్రాణవాయువు సృష్టించే గొప్ప శాస్త్రవేత్త విశ్వంలో చెట్లు మాత్రమే అన్నారు.
వృక్ష సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణాన్ని ప్రదక్షించాలని కోరా రు. అనంతరం మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.... ప్రజలు వనాలను రక్షించాలన్నా రు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు సురేష్, మంద రాధ, సర్పంచులు కందికట్ల మధుసూదన్, మాజీ జెడ్పిటిసి అరకాల వీరేశలింగం జమ్మికుంట సెక్షన్ అధికారి రెహ మాన్ , హుజరాబాద్, శంకరపట్నం సెక్షన్ అధికారులతో పాటు పాల్గొన్నారు.






