మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిర్మల్ జూన్ 3 ( విజయక్రాంతి) మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉండి అనేక పథకాలను అమలు చేస్తుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఉప్పల కావ్య గణేష్ చక్రవర్తి అన్నారు.నిర్మల్ పట్టణంలోని 1 వ వార్డు గాంధీనగర్ కాలనీలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి కార్యక్రమాన్ని ఆమె హాజరయ్యారు.
మాట్లాడు తూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం మరియు ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇ స్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కత్తి నరేందర్ , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు రమ , శ్రీవాణి , వార్డ్ ఆఫీసర్ రాజు ,మరి యు నాయకులు మదిరే లింగన్న,మొగిలి రాజేష్, బొమ్మేడ రాజేష్,కాలనీ వాసులు పాల్గొన్నారు.






