ఉన్నత విద్యలో ఆదర్శంగా నిలపాలి
గవర్నర్ శివప్రతాప్ శుక్లా
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఉన్నత విద్యలో తెలంగాణ దేశానికే ఆదర్శం గా నిలవాలని, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టిన భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను 2026 విద్యా సంవత్సరం నుంచి అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో గవర్నర్‌తో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఏరోస్పేస్, డిఫెన్స్, మారిటైమ్, ఫిన్టెక్, క్లైమేట్ గవ ర్నెన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ తదితర అభివృద్ధి చెందుతున్న పాధాన్యత కలిగిన రంగాలలో ప్రవేశపెట్టిన నూతన కోర్సుల గురించి గవర్నర్‌కు బాలకిష్టారెడ్డి వివరించారు. జాతీయ విద్యావిధానం 2020 (ఎన్‌ఈపీ పాటు అంతర్జాతీయ ఉత్త మ ప్రమాణాలకనుగుణంగా ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. అ లాగే జాతీయ ప్రాధాన్యతలు, పరిశ్రమల అవసరాలు, భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టి లో ఉంచుకొని ఈ కోర్సులను రూపొందించినట్లు వివరించారు. ఉపాధి ఆధారిత, భవి ష్యత్ అవసరాలకు అనుగుణమైన కోర్సులను ప్రవేశపెట్టడం పట్ల గవర్నర్ శివ ప్రతా ప్ శుక్లా హర్షం వ్యక్తం చేసినట్లు ప్రొఫెసర్ బాలకిష్టా రెడ్డి తెలిపారు.






