22 ఏను తక్షణమే ఎత్తివేయాలి
కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి
మేడ్చల్ అర్బన్, ఆగస్టు 21(విజయక్రాంతి): 22 ఏ నిషేధిత జాబితాను వెంటనే రద్దు చేయాలని బిజెపి నాయకులు కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బిజెపి మాజి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి.మేడ్చల్ రూరల్,మేడ్చల్ అర్బన్ బిజెపి జిల్లాల అధ్యక్షులు గిరివర్దన్ రెడ్డి. జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి.వీటి లక్ష్మీ ల నాయకత్వంలో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి ని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 - ఏ పేరుతో అవినీతి అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. 22-ఏ వల్ల పేదలు,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తమ సొంత భూములపై హక్కులు కలిగి ఉన్నప్పటికీ వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. తప్పిదాలకు పాల్పడినట్లు విచారణలో తేలిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారిని వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి నాయకులు జిల్లా కలెక్టర్ ను కోరినట్లు వెల్లడించారు.
అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రజల భూలు,ఆస్తుల విషయంలో ఎలాంటి అన్యాయం జరిగినా బిజెపి చూస్తూ ఊరుకోదని వారు స్పష్టం చేశారు.రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజేపి కార్యవర్గ సభ్యులు తిరుమల్ రెడ్డి.వెంకట్ రెడ్డి.బిజేపి రూరల్ నాయకులు నాగారం మున్సిపల్ మాజి చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి.జిల్లా కార్యదర్శి వి హనుమాన్.పాతూరి ప్రభాకర్ రెడ్డి.జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ చల్వాదీ ప్రవీణ్ రావు.కీసర మండల అధ్యక్షుడు బాలారాజ్.నాగారం పట్టణ అధ్యక్షులు నాగరాజ్.ఘట్కేసర్ అధ్యక్షులు బసవ రాజ్.నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






