08-08-2025 01:04:02 AM
ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్
మంచిర్యాల, ఆగస్టు 7(విజయక్రాంతి) : విద్యుత్ ప్రమాదాలు జరుగని జిల్లాగా మంచిర్యాలను ఉంచాలని, ప్రజలకు, రైతులకు నిరం తరం నాణ్యమైన విద్యుత్ అందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) మధుసూదన్ కోరారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లాలోని విద్యుత్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఈ (ఆపరేషన్) బీ అశోక్ తో కలిసి మాట్లాడారు.
ప్రజలకు అం దుబాటులో ఉంటూ నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలనీ, ఏదైనా సమస్య తలెత్తినా వెంటనే పరిస్కారించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో కరెంటుతో ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని, జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. సిబ్బంది గ్రామాలలోకి వెళ్లి పల్లెబాట, పొలంబాట, పట్నం బాట నిర్వహించి ప్రజలకు విద్యుత్ ప్రమాదాల విషయంలో అవగాహన కల్పించాలని సూచించారు.
రైతులకు వ్యవసాయ కనె క్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రమాదకరంగ ఉన్న విద్యుత్ లైన్‌లో లోపాలు, పొట్టి పోల్స్, లూస్ లైన్స్, వంగిన పోల్స్, ఎత్తు తక్కువ ఉన్న ట్రాన్స్ ఫార్మర్ గద్దెలను గుర్తించి సరిచేయాలన్నారు.
అనంతరం డివిజన్ ల వారిగా విద్యుత్ సమస్యలు, ప్రమాదాలు, పురోగతిపై చర్చించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ జిల్లా ఎస్‌ఈ ఉత్తమ్ జాడే, డీఈలు ఖైసర్, రాజన్న, ఎస్‌ఏఓ రాజేశం, ఏడీఈలు, ఏఈలు, ఏఏఓలు, సబ్ ఇంజనీర్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.