calender_icon.png 8 August, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక

08-08-2025 01:04:09 AM

మేడ్చల్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని వినాయక నగర్ డివిజన్ సమతానగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులను మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కండువా కప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందున తాము బీఆర్‌ఎస్ లో చేరామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, పంజా శ్రీకాంత్ యాదవ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.