దేశిరాజు పాత్ర నాకోసమే రాయడం చాలా సంతోషాన్నిచ్చింది
అనుష్క శెట్టి నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఘాటీ’. విక్రమ్ ప్రభు మేల్ లీడ్‌గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నటుడు విక్రమ్ ప్రభు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన పాయింట్ ఏంటి?
డైరెక్టర్ క్రిష్ గారిని చూసి నేను ఈ సినిమాకు ఓకే చెప్పా. ఆయన నన్ను కలిసి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. ఆయన చాలా పాజిటివ్ పర్సన్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్. నాకు కథ చెప్పడానికి ముందు ‘ఘాటీ’ వరల్ ఎలా ఉంటుందో చూపించారు. అలాగే నన్ను ఈ రోల్కు ఎందుకు సెలెక్ట్ చేశారో అనే విషయం గురించి అరగంటసేపు చాలా క్లియర్గా వివరించారు. హైదరాబాద్లో నాకున్న ఫ్యాన్ బేస్ గురించి చెప్పారు. నా గత సినిమాల్లోని చాలా సీన్స్ గురించి చెబుతూ.. నిన్ను దృష్టిలో పెట్టుకునే ‘దేశిరాజు’ క్యారెక్టర్ రాశానని చెప్పారు. ఆ మాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఆయనతో మాట్లాడాక సినిమా విషయంలో మా ఇద్దరి అభిప్రాయాలు సేమ్ అని అర్థమైంది. తర్వాత నా క్యారెక్టర్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చి స్టోరీ చెప్పారు.
ఇది మీ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కదా? ఎలా అనిపిస్తోంది?
నేను తెలుగులో చిరంజీవి గారికి, నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ని. వాళ్ల సినిమాలు ఎన్నోసార్లు థియేటర్లో చూశా. అలాంటి టాలీవుడ్లో ఇప్పుడు నేను డైరెక్ట్ సినిమా చేయడం చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది.
డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలని ఎప్పుడూ ప్లాన్ చేయలేదా?
తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. కానీ నా లైఫ్లో ప్లాన్ ప్రకారం ఏదీ జరగలేదు. నేను డైరెక్టర్ అవుదామనుకుంటే యాక్టర్ అయ్యా. అందుకే నా హార్ట్ ఏం చెబితే అదే చేసుకుంటూ వెళ్తున్నా. అనుష్క గారితో కలిసి నటించే ఛాన్స్ గతంలో ఒకసారి మిస్ అయింది. ‘రుద్రమదేవి’లో అల్లు అర్జున్ గారు చేసిన గోనగన్నారెడ్డి పాత్రను గుణశేఖర్ గారు ఫస్ట్ నాకే చెప్పారు. కానీ అప్పుడు నాకు కుదరలేదు. అల్లు అర్జున్ గారు ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు.
క్రిష్ గురించి చెప్పండి?
క్రిష్ గారి డైరెక్షన్లో పని చేయడం నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఆయనతో ఏదైనా ప్రాబ్లం అంటే ఆయన పొయెటిక్గా ఉండడమే. సీన్స్ విషయంలో చాలా కాన్పిడెంట్గా ఉంటారు. ప్రతి సీన్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా తీశారు. అనుష్క గారితో పాటు మిగతా నటీనటులంతా స్క్రిప్ట్లో ఉన్నది ఉన్నట్లు చేశారు.
మీ ఫాదర్ ప్రభుతో కలిసి మళ్లీ మిమ్మల్ని ఎప్పుడు చూడొచ్చు?
నాన్నగారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకూ ఉంది. కానీ మేమిద్దరం కలిసి స్క్రీన్ మీద కనిపించడం కోసం అవసరం లేకున్నా ఏదో ఇరికించి పెట్టినట్లు కాకుండా నిజంగా కథలో ప్రాముఖ్యం ఉంటే చూసే ప్రేక్షకులకు కూడా ఆనందంగా ఉంటుంది. అలాంటి స్టోరీ వస్తే చేయానికి సిద్ధంగా ఉన్నా.
‘దేశిరాజు’ క్యారెక్టర్ మీకు ఏదైనా కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది?
నటులకు ప్రతి క్యారెక్టర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది. ఇందులో నా పాత్ర మాట్లాడే భాష ఛాలెంజింగ్గా అనిపించింది.
అనుష్కతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
అనుష్క గారికి నేను అభిమానిని. ఆమె పేరుకు తగ్గట్టు నిజంగా ఎంతో స్వీట్ పర్సన్. ఆమె ఎంత స్వీట్ పర్సనో అంతే పవర్ఫుల్ కూడా. ఆమె తన కళ్లతోనే అన్ని హావభావాలూ పలికించగలరు.






