calender_icon.png 30 August, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుట్టినరోజునాడే ధన్సికతో నిశ్చితార్థం

30-08-2025 01:44:37 AM

కోలీవుడ్ నటుడు విశాల్, నటి ధన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. వీరి ఎంగేజ్మెంట్ శుక్రవారం ఉదయం జరిగినట్లు విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. తన పుట్టినరోజు నాడే ఎంగేజ్మెంట్ జరగడం ఎంతో ఆనందంగా ఉందని విశాల్ తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. అందరి ఆశీస్సులు కావాలని కోరుతూ ఎంగేజ్మెంట్ ఫొటోలు పంచుకున్నారు. త్వరలోనే పెళ్లి తేదీని వెల్లడిస్తామన్నారు.

విశాల్ ఫలానా హీరోయిన్ను వివాహం చేసుకోనున్నారంటూ గతంలో పలుమార్లు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ‘నడిగర్ సంఘం’ భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని ఆయన ప్రకటించారు. ఈ ఏడాది మేలో ఆ బిల్డింగ్ పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘త్వరలోనే ప్రేమ వివాహం చేసుకుంటా’ అని చెప్పారు. ధన్సిక నటించిన యాక్షన్ మూవీ ‘యోగీ దా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన ఆయన ఆమెతో తన ప్రేమ విషయం మీడియాకు వెల్లడించారు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుందని తెలిపారు.

రజనీకాంత్ ‘కబాలి’లో కీలక పాత్ర పోషించిన ధన్సిక... ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ తదితర చిత్రాల్లో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది ‘మదగజ రాజ’తో పలకరించిన విశాల్.. ప్రస్తుతం ‘మగుడం’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు.