14 August, 2026 | 2:41 AM

కృష్ణా నీటిని ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆరే

14-08-2026 01:39 AM
  1. 500 టీఎంసీల వాటాకోసం సీఎం కొట్లాడుతున్నారు 
  2. ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 13 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి, కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటా చాలని కేసీఆర్ సంతకం చేసి రైతులకు మరణ శాసనం రాశారని ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. ఇప్పుడు కృష్ణాలో 500 టీఎంసీల వాటా కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్లాడుతున్నారని ఆయన తెలిపారు.

గురువారం ఆయన సీల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రంతో పనిలేదని, రాష్ట్రాలతోనే డీల్ చేసుకుంటామని చెప్పి మన నీళ్లను వదిలేశారని, ఆ పాపాలను కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయమైనా సరే అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, అందుకు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన డిమాండ్ చేశారు.