14 August, 2026 | 2:58 AM

దీపే ధూపే నైవేద్యానికి నిధులు పెంచాలి

14-08-2026 01:37 AM

అర్చకుల కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి 

నిర్మల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న దీప ధూప నైవేద్యానికి నిధులు పెంచి అర్చకులకు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం (బంగల్పేట్) లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో ఏళ్ల తరబడి నైవేద్యాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం అర్చకులకు వేతనాలు పెంచి ప్రతినెల చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఆలయంలో పనిచేసే అర్చకులకు ప్రభుత్వ పథకాలు అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అర్చకుల సమస్యలను వివరించనున్నట్లు తెలిపారు. అంతకుముందు నిర్మల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) వద్ద రోగులకు, కొండపూర్లోని ’బాల సదనము’ (శాంతినికేతన్ వికలాంగుల కేంద్రం) లోని పిల్లలు, దివ్యాంగులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చకులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షునిగా తుపాకుల వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా మ హాంతయ్య,కోశాధికారిగా అర్జున్,కార్యదర్శి గామాధవ కృష్ణ (ఖానాపూర్),సహాయ కార్యదర్శిగా గోవిందయ్య,గౌరవ సభ్యులుగా సంతోష్, లక్ష్మణ్ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి నందనం హరికిషన్ శర్మ గారు, రాష్ట్ర కన్వీనర్ గొడవర్తి చక్రధరాచార్యులు గారు, గొడవర్తి విజయ కుమార్ ఆచార్యులు గారు, సహాయ కార్యదర్శి పరిపూర్ణాచారి గారు, నాయకులు అర్జున్ రాజ్ గారు, ప్రశాంత్ గారు, శ్రీ కాంత్ గారు, లక్ష్మణప్ప గారు మరియు జిల్లా అర్చక బంధువులు పాల్గొన్నారు.