అమరుల త్యాగ ఫలితమే దేశానికి స్వాతంత్య్రం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల టౌన్, ఆగస్టు 13: అమరుల త్యాగ ఫలితమే భారత దేశానికి స్వాతంత్య్రం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పీఎం మోదీ పిలుపు మేరకు గురు వారం బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ముఖ్య అతిథిగా హాజరై బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ తో కలిసి మాట్లాడారు.
ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, ప్రస్తుతం మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దేశ సరిహద్దుల వద్ద నిరంతరం కాపల కాస్తున్న సైనికుల వల్లేనని అన్నారు. ప్రతి దేశ భక్తితో అమర సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. పీఎం పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కోరారు.
వివిధ పాఠశాలల, కళాశాలలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. 500 మీటర్ల భారీ జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, పురుషోత్తం జాజు, కొయ్యల ఎమాజీ, దుర్గం అశోక్, గోలి రాము, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, పట్టి వెంకట కృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, ఆడే ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్న రాణి, బేర సత్యనారాయణ, రాచర్ల సంతోష్, పానుగంటి మధు, బొడ్డు రఘునందన్, విద్యార్థులు తదితరుల పాల్గొన్నారు.






