04-07-2025 01:43:59 AM
రాష్ట్రంలో ఎల్లో అలెర్ట్ జారీ
హైదరాబాద్, జులై 3 (విజయక్రా తి): రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షా లు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపు లు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొమురంబీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షా లు కురిసే అవకాశముంది.