28-07-2024 12:05:00 AM
‘పురుషోత్తముడు’ సక్సెస్ మీట్‌లో డైరెక్టర్ రామ్ భీమన
రాజ్‌తరుణ్ హీరోగా నటించిన ‘పురుషోత్తముడు’ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. రామ్ భీమన దర్శకత్వంలో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డాక్టర్ రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా పరిచయమైంది. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ముఖేశ్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్‌తో రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. డైరెక్టర్ రామ్ భీమన మాట్లాడుతూ.. “పురుషోత్తముడు’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా ఉంది.
రాజ్‌తరుణ్ ఫోన్‌లో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్ సపోర్ట్‌తోనే ఈ చిత్రాన్ని ఇంత బాగా తీయగలిగాం. పూల రైతుల సమస్యను తెరపై చూపించటమనేది ఒక కొత్త నేపథ్యమని, కొత్త ప్రయత్నమంటూ అందరూ ప్రశంసిస్తున్నారు. స్టార్ హీరోతో చేసి ఉంటే బ్లాక్‌బస్టర్ అయ్యేదన్న మాటలు వినిపిస్తున్నాయి. మేము కంటెంట్‌ను నమ్ముకున్నాం. అది బాగుంటే ప్రేక్షకులు మిగతా విషయాలు పట్టించుకోరనేది మాకు తెలుసు” అని చెప్పారు. “ఈ సినిమాలో అమ్ములు క్యారెక్టర్ చేశాను. స్క్రీన్ మీద అందంగా ఉన్నానని చెప్తున్నారు.. లంగావోణి కట్టుకుంటే తెలుగమ్మాయిలా కనిపించకుండా ఎలా ఉంటాను మరి! ఈ పాత్ర కోసం ఏడాదిగా కాస్ట్యూమ్స్, మేకోవర్, వర్క్‌షాప్స్ చేశాను” అని హీరోయిన్ హాసినీ సుధీర్ తెలిపింది.