22-12-2025 07:37:09 PM
సమగ్ర మానవత్వం విలువల ప్రోత్సాహం
జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వీర్ బాల్ దివస్ ద్వారా యువతలో ధైర్యం, సమగ్ర మానవత్వ విలువలను ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్ ఒక ప్రకటనలు తెలిపారు. జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ వరకు వీర్ బాల్ దివస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన జరగనున్న కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల అంశాలపై పోటీలను నిర్వహించడం జరుగుతుంది.
అంగన్వాడి పాఠశాలలలో కథలు చెప్పడం, ఆటలు, ప్రాథమిక పాఠశాలలలో బొమ్మలు గీయడం, కథలు చెప్పడం, బాల బాలికల ఉన్నత పాఠశాలలలో వ్యాసరచన పోటీలు, ముగ్గులు, కళాశాలలలో సందేశాత్మక నాటికలు సమగ్ర అంశాలపై చర్చ, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త శారద, జెండర్ స్పెషలిస్ట్ రాణి, రాజేశ్వరి, పాఠశాల ఉపాధ్యాయులు, పి టి, విద్యార్థులు పాల్గొన్నారు.