22-12-2025 07:31:01 PM
మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకులు
రామగిరి,(విజయక్రాంతి): మండలంలోని బుధవారంపేట గ్రామంలో సింగరేణి అధికారులు ఇండ్లకు నెంబర్లు వేస్తుండగా సింగరేణి గో బ్యాక్ అంటూ గ్రామస్తులు అధికారులను అడ్డుకొని వెనక్కి పంపారు. గ్రామస్తుల న్యాయ పోరాటానికి సిపిఎం పార్టీ మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం బుధవారం పేట రైతుల భూములను మాత్రమే తీసుకుంటామనడం సరికాదన్నారు.
భూములతో గ్రామాన్ని స్వాధీనం చేసుకొని భూములకు బదులు భూములు ఇవ్వాలని లేనిచో ఎకరానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తో పాటు కొత్త కాలనీ ఏర్పాటు చేసి బుధవారంపేట గ్రామాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామంలోని రైతులు వ్యవసాయ కూలీలు యువకులు విద్యార్థులు మహిళలను చేతివృత్తుల వారిని ఏకం చేసి గ్రామాన్ని రక్షించుకోవడానికి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆయనతోపాటు సిపిఎం నాయకులు బాబు రవి గ్రామస్తులు ఉన్నారు.