calender_icon.png 22 December, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్‌లో ఘనంగా కాక వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

22-12-2025 07:48:46 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): కేంద్ర మాజీ మంత్రి, మలి దశ ఉద్యమకారుడు కాక వెంకటస్వామి 11 వ వర్ధంతి సందర్భంగా సుల్తానాబాద్ పట్టణంలో కాక వెంకటస్వామి  విగ్రహానికి పూల మాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. కాక వెంకటస్వామి సేవలు మరువలేనివి.

ఆయన సేవలు ఆదర్శనీయం అని, దేశం గర్వించే విధంగా ఎన్నో సేవ కార్యక్రమలు చేసి గొప్ప వ్యవక్తిగా ప్రజల మనసులో నిలిచి పోయిన మహనీయులు అని కొనియాడారు. కాక ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వారసులు ఎమ్మెల్యే వినోద్, మంత్రి వివేక్, మనుమడు పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.