28-07-2024 12:05:00 AM
వైవిధ్యమైన, హాస్య చిత్రాలకు అలరించే హీరో అల్లరి నరేశ్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతుండగా, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. కాగా శనివారం చిత్రబృందం పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించింది. మెహర్ తేజ్ దర్శకత్వంలో మరో వారం రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో రుహానీశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. జిజు సన్నీ డీవోపీగా, రామకృష్ణ అర్రం ఎడిటర్‌గా, విశాల్ అంబానీ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.