calender_icon.png 22 December, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని కాకతీయ హై స్కూల్ లో ఘనంగా గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి వేడుకలు

22-12-2025 07:40:16 PM

మంథని,(విజయక్రాంతి): మంథని కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గణితానికి చేసిన సేవలను గురించి పాఠశాల ప్రిన్సిపల్, గణిత ఉపాధ్యాయుడు ప్రదీప్ రెడ్డి  తెలియజేశారు. గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రము, అనంత శ్రేణులు, నిరంతర భిన్నాలు, త్రికోణమితి వంటి రంగాలలో శాస్త్రీయ శిక్షణ లేకపోయినా తనదైన శైలిలో గణిత సమస్యలకు పరిష్కారం కనుగొన్నారు.

రామానుజన్ నెంబర్ 1729 అని దీనిని రెండు విభిన్న విధాలుగా, రెండు గణాల మొత్తముగా వ్యక్తపరచవచ్చు అన్నారు. ఆయన అతి చిన్న వయసులో చనిపోవడం భారతదేశానికి తీరని లోన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం గణిత ఉపాధ్యాయులందరికీ ఒక ప్రేరణ అని, అనంతరం కేక్ కట్ చేసి గణిత  ఉపాధ్యాయులకు పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిల్లలందరూ గణితానికి సంబంధించి అనేక ప్రాజెక్టులను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో అనేక గణిత సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పలువురుని  అలరించారు. గణిత రంగోలి మ్యాథమెటిక్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా  కార్యక్రమానికి గణిత ఉపాధ్యాయుడు దేవేందర్ ఆర్గనైజర్ గా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి. శ్రావణ్ రెడ్డి, స్రవంతి, పావని, పాఠశాల గణిత ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.