22-12-2025 07:34:12 PM
తానూర్,(విజయక్రాంతి): తానూర్ మండల కేంద్రంలోని వాగ్దేవి విద్యా నికేతన్ ఉన్నత పాఠశాలలో సోమవారం 'గణిత దినోత్సవ' వేడుకలను నిర్వహించారు. గొప్ప గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ‘గణిత మేళా’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, సంక్లిష్టమైన గణిత సూత్రాలను సులభంగా అర్థం చేసుకునేలా విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ప్రాజెక్టులు సందర్శకులను మెప్పించాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ ఉషా కిరణ్మయి, డైరెక్టర్లు పి. అరవింద్ రెడ్డి, జి. అవినాష్, జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు గణితంపై మక్కువ పెంచుకోవాలని, నిత్య జీవితంలో గణితం ప్రాధాన్యతను గుర్తించాలని సూచించారు. కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వారు పేర్కొన్నారు.