calender_icon.png 22 December, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవ్‌ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

22-12-2025 07:58:54 PM

ఆర్మూర్,(విజయక్రాంతి): ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్ అన్నారు. అంకాపూర్ లోని  భార్గవి విద్యానికేతన్ లో క్రైమ్ గురించి విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు.

సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గోపి కృష్ణ, సామాజిక సేవకుడు తులసి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.