జీపీఎస్ పాఠశాలల్లో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ
చర్ల, జూన్ 30, (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జీపీఎస్ పాఠశాలల్లో ఉద్దీపకం వర్క్బుక్ అంశాలు ప్రతి విద్యార్థికీ అర్థమయ్యేలా బోధించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ ఉపాధ్యాయులను ఆదేశించారు. మంగళవారం ఛత్తీస్గఢ్ సరిహద్దులోని చెన్నాపురం, ఉయ్యాలమడుగు జీపీఎస్ స్కూళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వయంగా టీచర్, స్టూడెంట్ పాత్ర పోషించి పిల్లలను పరీక్షించగా... ఉద్దీపకం బుక్లోని అంశాలు, చతుర్వేద ప్రక్రియల్లో పిల్లలు వెనుకబడి ఉండటాన్ని గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ప్రతి పిల్లాడికీ ఉద్దీపకం బుక్ తప్పనిసరి. హాజరు తగ్గకుండా చూడాలి. టీచర్లు ఇంటింటికీ తిరిగి పిల్లలను బడికి రప్పించాలి‘ అని స్పష్టం చేశారు. చెన్నాపురంలో 55 మంది విద్యార్థులు ఉండగా మరో టీచర్ను త్వరలో నియమిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పీవో ఆదేశాలతో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి చందన తిమ్మిరిగూడెం జీపీఎస్ స్కూల్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, బాలకృష్ణ పాల్గొన్నారు.






