calender_icon.png 25 May, 2025 | 10:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పుడంతా డాడీ మ్యాటరే!

25-05-2025 12:10:44 AM

రాష్ట్రంలో ఇప్పుడు ఏ నోట విన్నా డాడీ మ్యాటరే వినిపిస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విషయం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. పార్టీ వ్యవహారంపై కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసి న లేఖ లీక్ కావడంతో పార్టీల నేతలంతా కామెంట్లు చేస్తున్నా రు. ఈ అంశంతో రాష్ట్రంలో ఇతర పొలిటికల్ అంశాలన్నీ పక్కకుపోయాయి.

అంతా ఇప్పుడు ఈ అంశంపైనే చర్చించుకుంటున్నారు. బీఆర్‌ఎస్ అలాగే ఉంటుందా..చీలిపోతుందా..కవిత పార్టీలో ఉంటారా..కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తారా..అంటూ పొలిటికల్ అనలిస్టులు చర్చించుకుంటున్నారు. హరీశ్‌రావు పార్టీ వీడతారని భావించి అందుకే ముందస్తు జాగ్రత్తలో భాగంగానే కవిత లెటర్ లీక్ వ్యవహారంతో మిస్టర్ డిపెండబుల్‌ను డిస్టర్బ్ చేస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది.

ఇక కవిత మరో షర్మిల కానున్నారంటూ కూడా ప్రచారం నడుస్తోంది. అందుకే ఆమెను రేవంత్ వదిలిన బాణం అంటూ మరికొందరు పేర్కొంటున్నారు. అయితే ఏదేమైనా కవిత ఉద్దేశం మాత్రం నెరవేరిందని పలువురు పేర్కొంటున్నారు. పొలిటికల్‌గా వెనకబడిపోయిన ఆమె ఇప్పుడు డాడీ లెటర్ లీక్ మ్యాటర్‌తో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చారని అంటున్నారు. అయితే కవిత రాజకీయ భవిష్యత్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

 విజయ భాస్కర్