సుర సురమంటూ వస్తోంది!
విరాట్ కర్ణా హీరోగా దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో నభా నటేశ్, ఐశ్వర్యా మీనన్, రిషబ్ సావ్నీ, జగపతిబాబు, గరుడ రామ్, మహేశ్ మాంజ్రేకర్, జయప్రకాశ్, మురళీశర్మ, అనసూయ భరద్వాజ్, బీఎస్ అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, భక్తి గీతం ‘నమో రే’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా సెకండ్ సింగిల్‌గా ‘సుర సుర’ అనే గీతాన్ని తెలుగు వెర్షన్‌లో ఏప్రిల్ 19న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ పాటను సంప్రదాయ పెళ్లి సంబరాల ఆనందం, ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు.
భారీ సెట్స్‌లో చిత్రీకరించిన ఈ పాటకు సంగీతాన్ని జునైద్ కుమార్, అభే అందించగా, కాసర్ల శ్యామ్ సాహిత్యం రాశారు. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ పాడిన ఈ పాటకు గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూలై 3న విడుదల కానుంది.




