07-07-2025 12:00:00 AM
మండిపడ్డ మాజీ ఎంపీ బీబీ పాటిల్, జుక్కల్ మాజీ శాసన సభ్యురాలు అరుణతార
ఎల్లారెడ్డి జూలై 6, (విజయక్రాంతి): పేదోడు దళితుడు ప్రజా ప్రభుత్వ పాలనలో ఓ పార్టీకి చెందిన నాయకుడు మండల అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఆయనకే రక్షణ లేదు ప్రజా ప్రభుత్వంలో సామాన్యుడికి ఎక్కడుంది రక్షణ అంటూ నిలదీశారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం గ్రామంలో ఊరి చివరన ఉన్న అతని సొంత స్థలంలో ఇల్లు నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో ఇల్లు కలవక 6 ఫీట్ల స్థలం ప్రభుత్వ స్థలంలోకి జరగడంతో గ్రామంలోని ఒక్కరి ఫిర్యాదుతో ఆయన ఇల్లును రెండు గజాలు ఆరు ఫీట్ల దూరం ఇంటిని ఆక్రమంగా కూల్చివేసి కుటుంబాన్ని ఇబ్బందుల గురిచేసి చిందర వందర చేసిన సంఘటన గ్రామ ప్రజలు ఇంకా మరిచిపోనేలేదు.
విషయం తెలుసుకున్న జహీరాబాద్ పార్లమెంట్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు, జుక్కల్ మాజీ శాసనసభ్యులు అరుణతార, మాజీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బాణాల లక్ష్మారెడ్డి, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు బత్తిని దేవేందర్ నక్క గంగాధర్ మర్రి బాలకృష్ణ తదితరులు సంఘటన స్థలానికి నేరుగా చేరుకొని, కూల్చిన ఇంటి ప్రదేశాన్ని పరిశీలించారు.
ఇల్లు కూల్చినంత మాత్రాన, అంతా అయిపోలేదని రానున్న రోజుల్లో ఓట్ల కోసం ఎమ్మెల్యే మదన్మోహన్ ఆ గ్రామానికి రాకపోడా వచ్చినప్పుడు ఆ గ్రామంలోని ప్రజలు తరిమి తరిమికొట్టే రోజులు మునుముందే ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, జహీరాబాద్, పార్లమెంటు మాజీ ఎంపీ బీబీ పాటిల్ మండిపడ్డారు.
అనంతరం మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ఇల్లు కూల్చినంత ఈజీ కాదు, ఇదెక్కడి రాజకీయం గ్రామంలో మారుమూల పల్లెటూరులో రెండు గజాల జాగ కోసం కక్షపూరితంగా కట్టిన ఇల్లును కూల్చే వరకు అధికారులతో పోలీస్ పహారాతో పటిష్టంగా కూల్చివేసి కుటుంబాన్ని చిందర వందర చేసిన సంఘటన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేదని ఈ పాపము ఊరికే పోదని ఎమ్మెల్యే మదన్మోహన్ పై మాజీ ఎంపీ బీబీ పాటిల్ మండిపడ్డారు.
కూల్చేసిన కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అన్నారు. నష్టపోయిన కుటుంబానికి మాజీ ఎంపీ బీబీ పాటిల్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పదాధికారులు వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.