calender_icon.png 7 July, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ తెరపైకి మైక్రోఫైనాన్స్‌ల అలజడి..!

07-07-2025 12:00:00 AM

- రుణ బకాయిలు చెల్లించలేదని  వేధింపులు, బెదిరింపులు

- బెల్లంపల్లిలో ఫైనాన్స్‌దారులపై తిరగబడిన మహిళలు

బెల్లంపల్లి అర్బన్, జూలై 6: మూడు దశాబ్దాల క్రితం పేద ప్రజలను కాకావికలం చేసి తోక ముడిచి పారిపోయిన మైక్రో ఫైనాన్స్‌లు మళ్లీ తెరపైకి వచ్చాయి. రుణ బకాయిలు చెల్లించలేదని మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లు వేధింపులపై మహిళలు తిరగబడిన సంఘటన మంచిర్యా ల జిల్లా బెల్లంపల్లిలో చోటుచేసుకుంది.

మైక్రో ఫైనాన్స్‌లు మళ్లీ పాగవేశాయి. పేద ప్రజలు, మహిళల ఆర్థిక వెనుకబాటును ఆసరా చేసుకొని దోపిడి చేస్తున్న మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలు మళ్లీ మొదలయ్యాయి. పట్టణంలోని అశోక్‌నగర్‌లో రుణబకాయ లు చెల్లించలేదని పలువురు మహిళలను బెదిరించిన మైక్రో ఫైనాన్స్ ఏజెంట్లపై మహిళలు ఎదురు తిరిగారు.

రుణాలు తీసుకున్న మహిళలు సకాలంలో బకాయిలు చెల్లించలేదని నెపంతో మైక్రో ఫైనాన్స్‌దారులు వేధిం పులకు పూనుకున్న సంఘటనతో మైక్రో ఫైనాన్స్ అరాచకాలు వెలుగు చూశాయి. బెల్లంపల్లిలోని కాల్ టెక్స్‌లో మందన్, సాక్షి, పిన్‌కేర్ పేరుతో మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఏకంగా ఆఫీసులే ఏర్పాటు చేశారు. 

తిరుగుబాటు షురూ..

బెల్లంపల్లిలో మైక్రో ఫైనాన్స్‌ల వేధింపులపై మహిళలు తిరుగుబాటుకు శ్రీకారం చుట్టారు. కొంత కాలంగా గుట్టు చప్పుడుగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థలు పని చేస్తున్నాయి. మహిళలకు ఆర్థిక రుణాలు ఇస్తామనే పేరిట వారికి అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నా రు. తొలుత మహిళలు మైక్రో ఫైనాన్స్ దా రుల మాటల మాయలోపడి ఊబిలో కూరుకుపోతున్నారు. భారీగా రుణాలు తీసుకొని వారి వేదింపుల బారిన పడుతున్నారు.

రుణాలు మంజూరు చేసినప్పుడు ఎంతో మర్యాదగా మభ్యపెట్టి రుణా లు ఇస్తున్నారు. తీరా వాటి చెల్లింపుల వాయిదాలు కాస్త అటు ఇటుగా జరిగితే చాలు ఇక మైక్రో ఫైనాన్స్‌లు తమ తడాఖాను చూపిస్తున్నాయి. ముక్కుపిండి మరీ వసూలు చేస్తు న్నారు. రుణాలు తీసుకున్న మహిళలు ఎంత టీ బెదిరింపులు, వేధింపులకి గురైతే కానీ, వారిపై తిరగబడుతున్నారనే విషయం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

వేధింపులు, అంతా ఇంతా కాదు..

మూడు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాం లో మైక్రో ఫైనాన్స్‌ల వేధింపులు అంతా ఇంతా కాదు. అనధికారికంగా  పుట్టగొడుల్లా మైక్రో ఫైనాన్స్ లు కోకొల్లలుగా వెలిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో మైక్రో ఫైనా న్స్‌లు విస్తరించాయి. అందులో బాగంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి లో కూడా మైక్రో ఫైనాన్స్‌లు అడుగుపెట్టా యి.

రుణాలు చెల్లించని వారినీ ఏకంగా గ్రూపు సమావేశాల్లోనే అందరి ముందు అవమానించిన సంఘటనలు భరించలేక ఆత్మహత్యల దుష్టంతాలు కూడా చోటు చేసుకున్నాయి. రుణాలు చెల్లింపుల విషయంలో మహిళా గ్రూపుల మధ్య విభేదా లకి మైక్రో ఫైనాన్స్‌లు కారణమయ్యాయి. ఒకరిపై ఒకరినీ ఉసిగొలిపి నిర్బంధ  వసూళ్ళకి పాల్పడ్డారు.

ఆయా మహిళా గ్రూపుల కు మైక్రో సంస్థల నుంచి ప్రాతినిధ్య వహిం చే వారీ, అసాంఘిక వేధింపులకి అడ్డూ అదుపు లేకుండా పోయాయన్న విమర్శలు కూడా అప్పట్లో దుమారం లేపాయి. మైక్రో ఫైనాన్స్ ల దుష్ట చేష్టలకు మహిళలు గురైన సంఘటనలు అప్పట్లో నిత్య కృత్యంగా వెలుగు చూసేవీ. 

ఒక్క మాటలో చెప్పాలంటే  మైక్రో ఫైనా న్స్‌ల బారిన పడి సామాన్య పేద కుటుంబాలు విలవిలలాడాయి. రుణాల పేరిట పేద ప్రజల జీవితాల్లో మైక్రోఫైనాన్సులు అల్లకల్లోలం  సృష్టించాయి. పచ్చని సంసారాల్లో నిప్పులు పోశారన్న  ఆరోపణకి మైక్రో ఫైనాన్స్ లు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ లు పెట్రేగిన అరాచకాలపై రాష్ట్రంలో వ్యతిరేకత పెల్లుబికింది. మితిమీరిపోయిన మైక్రో ఫైనాన్స్ ల అరాచక, అసాంఘిక చేష్టలపై ఎక్కడికక్కడ మహిళలు తిరగబడడం మొదలెట్టారు. 

మైక్రో ఫైనాన్స్‌ల మూలాలు ఆంధ్ర ప్రాంతంలో ఉండటంతో అప్పటి తెలుగుదేశం చంద్రబాబు ప్రభుత్వానికి సెగ తగి లింది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లపై నిషేధo విధించక తప్పలేదు. అప్పుడు కానీ తెలంగా ణ ప్రాంతం నుంచి మైక్రో ఫైనాన్స్‌లు  తిరోగమించాయి. 

ఈ మైక్రో ఫైనాన్స్‌లు ఎక్కడివి..?

కనుమరుగైన మైక్రో ఫైనాన్స్‌లు మూడు దశాబ్దల తర్వాత మళ్లీ తెలంగాణలో పురుడు పోసుకున్నాయి. మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలను మర్చిపోని ప్రజ లు మళ్లీ వారిపై వ్యతిరేకతను వెళ్ళగక్కుతున్నారు. చట్టబద్ధం కానీ మైక్రో ఫైనాన్స్ లు బెల్లంపల్లిలో మళ్లీ ప్రవేశించడంపై కలకలం రేగుతోంది. మైక్రో ఫైనాన్స్‌ల  వెనుక ఎవరున్నారనే చర్చ జరుగుతోం ది.

గతంలో ఆంధ్ర ప్రాంతం నుంచి మైక్రో ఫైనాన్స్ పెట్టుబడిదారులు తెలంగాణకొచ్చి ప్రజాజీవనాన్ని ఆగమాగం చేశారు. ఈ మైక్రో ఫైనాన్స్‌లు కూడా ఆంధ్రా నుంచి వచ్చినవనే అభిప్రాయా లు సర్వత్రా  వ్యక్తమవుతున్నాయి. ఇలాం టి ఆర్థిక బిజినెస్ సంస్థలు ఆంధ్ర నుంచే పుట్టుకొస్తాయన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైక్రో ఫైనాన్స్‌ల తీరు పై అధికారగణం దృష్టి పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోసారి మైక్రో ఫైనాన్స్‌ల బారిన పేద ప్రజలు, మహిళ లు మోసపోకుండా అప్రమత్తం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.