ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
టీజీఈ జేఏసీ
అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన జేఏసీ నేతలు
ఖమ్మం, ఏప్రిల్ 16(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ పెన్షన ర్స్ ఆధ్వర్యంలో ఉద్యోగుల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన స మస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ పి శ్రీనివాస్‌రెడ్డికి జెడ్‌ఎ స్ జైపాల్, మోదుగు వేలాద్రి అధ్యక్షతన వినతిపత్రం అందజేశారు.
రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షనర్స్ (టీజీఈ జేఏసీ) రాష్ట్ర విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానాల నిర్ణయం మేరకు దీర్ఘకాలిక పెండింగ్ నాలుగు ప్రధాన సమస్యలను పరిశీలించి, వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని టీజీఈ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు.
2వ పీఆ ్స కమిషన్ రిపోర్ట్ తెప్పించి జూన్ 2 లోపు అ మలు చేయాలని,పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని,ఉద్యోగుల, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల మంజూరు చే యాలని,రాష్ట్రంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ (సీపీఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) ను పునరుద్ధరణ చేయాలని,01.09. 2004 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను అమలు చేయాలనిటీజీఈ జేఏ సీ నేతలు కోరారు.
కార్యక్రమంలో టీఆర్‌ఈఎస్‌ఏ జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు ఎస్‌కే రంజాన్, టీజీవో కోశాధి కారి సూరంపల్లి రాంబాబు, టీజీవో హౌస్ బిల్లింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్, టీఎన్‌జీ వో జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కొమరగిరి దుర్గాప్రసాద్, కోశాధికారి వల్లపు వెంకన్న, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏలూరి కోణార్, ఎస్‌జీపీఏ అధ్యక్షు లు పరిష పుల్లయ్య, తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్( టీజీఆర్‌ఈఏ) ఎం ప్లాయీస్ అసోసియేషన్ బాధ్యులు వెంకటపతి రాజు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు రవికు మార్ నాగేశ్వరరావు, ఈ.రామకృష్ణ, , టీఎన్జీవో మాజీ అధ్యక్షులు పూర్వ జేఏసీ చైర్మన్ పొట్టపింజర రామ య్య, నాలుగో తరగతి ఉద్యోగ సంఘ కార్యదర్శి కాంపాటి వెంకటరమణ,పంచాయతీరాజ్ మినిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం. రాజేష్ గుప్తా, మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్‌కే. అస్లాం ఖాన్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, డ్రైవర్స్ అసో సియేషన్ అధ్యక్షులు గంగన్న, గుప్త, గోవింద కృష్ణయ్య, అన్వర్, ఎస్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






