28 June, 2026 | 10:07 AM

నటుడు జగపతిబాబును మోసం చేసింది ఆ సంస్థేనా?

02-06-2024 01:59 AM

రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు జరుగుతున్నాయని, ప్రతీ ఒక్కరు ‘రెరా’ అనుమతి గల వెంచర్లలోనే ప్లాట్లు కొనుగోలు చేయాలని ప్రముఖ నటుడు జగపతిబాబు ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. ఇంతకీ ఆయన ఏ సంస్థకు యాడ్ ఫిలిం చేశారని ఆరా తీయగా.. ఫార్చ్యూన్ వ్యూ ప్రై.లి అనే సంస్థ కోసం ఆయన యాడ్ ఫిలిం చేశారని తెలుస్తోంది. ఆయన చేసిన ఇదే యాడ్ ఫిలింకు సంబంధించిన చెక్కు బౌన్స్ అయిందా ? లేదా ? అనేది పక్కన పెడితే ఆ సంస్థకు చెందిన కోటా విజయ్‌బాబు అనే వ్యక్తి గతంలోనూ ఫార్చ్యూన్ 99 హోమ్స్ పేరిట ప్రీలాంచ్‌లో ప్లాట్లను విక్రయించి అందినకాడికి దోచుకుని చేతులు ఎత్తేశాడు. అయితే కోటా విజయ్‌బాబు అవతారం మార్చి ముంబై రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి.. సరికొత్త స్కామ్‌కు తెరలేపాడని ప్రచారం.