26-07-2024 02:04:56 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. జంట నగరాల అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించారని గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని బడ్జెట్ లో నిధులు కేటాయించారని వెల్లడించారు. పదేళ్లలో బడ్జెట్ లో హైదరాబాద్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించారా..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హైదరాబాద్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదని తెలిపారు.