8 July, 2026 | 2:00 AM

జగ్గారెడ్డి మరిన్ని ఉన్నత పదవులు సాధించాలి

08-07-2026 12:00 AM

సిద్దిపేట, జూన్ 7 (విజయక్రాంతి): టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. జగ్గారెడ్డి ఆయన కుమార్తె జయారెడ్డిల జన్మదినం సందర్భంగా సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా సంగారెడ్డి ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారని అన్నారు.

సంగారెడ్డి ప్రజలకు కాకుండా రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చిన ముందుండి ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి చికిత్స కోసం లక్షలాది రూపాయలు అందించి అండగా నిలుస్తున్నారని చెప్పారు. జగ్గారెడ్డి లాంటి నాయకుడు దొరకడం సంగారెడ్డి ప్రజల అదృష్టమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్యాదారి మధు, గయాజుద్దీన్, అర్షద్, హుస్సేన్, విజయ, డానియల్, వహాబ్, రషీద్, సంతోషి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.