calender_icon.png 7 July, 2025 | 11:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో పాత్రికేయులపాత్ర కీలకం

07-07-2025 12:08:06 AM

నిర్మల్, జూలై 6 (విజయక్రాంతి): సామాన్యుడి సమస్యలను సైతం ఉన్నతాధికారుల వరకూ చేర్చుతూ వాటిని పరిష్కరించేందుకు వారధిగా నిలిచే పాత్రికేయుల పాత్ర సమాజంలో కీలకమైందని స్వామి వివేకానంద సొసైటీ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ప్రమోద్చంద్రారెడ్డి, ముఖ్యఅతిథి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు.

జిల్లాకేంద్రంలోని ఉత్సవ్ బంక్వెట్హాల్లో ఆదివారం స్వామి వివేకానంద సొసై టీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన నిర్మల్ ప్రెస్క్లబ్ నూతన కమిటీని సన్మానించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజాన్ని మార్చగలిగే శక్తి కేవలం పాత్రికేయు లకు మాత్రమే ఉందన్నారు. నిర్మల్ జిల్లా సాధనతోపాటు జిల్లా అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. అనం తరం శాలువాలతో నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.

ఇందులో సొసైటీ అధ్యక్షు డు కూన రమేశ్, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి ప్రవీణ్, కోశాధికారి నాయిడి మురళి, ఉపాధ్యక్షులు నూకల గురుప్రసాద్, వారల్ మనో జ్, కార్యదర్శులు అబ్ధుల్‌అజీజ్, అంక శంక ర్, సభ్యులు డాక్టర్ సుచిన్, డాక్టర్ కత్తి కిరణ్, సీఏ సాయిప్రసాద్, రావుల శ్రీనివాస్, నారాయణ, ఆమెడ రంజిత్, అన్ముల అశ్విన్, శ్రీ రామోజీ నరేశ్, శశివర్ధన్ పాల్గొన్నారు.