15 April, 2026 | 5:48 AM

జాగృతి కళాశాల విద్యార్థిని ప్రభంజనం

15-06-2025 12:00 AM

- నీట్‌లో 509 మార్కులు సాధించిన వైష్ణవి 

- అభినందించిన ప్రిన్సిపాల్ వినోద్‌కుమార్ 

వనపర్తి టౌన్, జూన్ 14: దశాబ్ద కాలంగా ఎంతగానో చదువుకు నిలయంగా ఉన్న వనపర్తి జిల్లాలో జాగృతి కళాశాల మరో అరుదైన ఘనత సాధించింది. నీట్‌లో  జాగృతి కళాశాల విద్యార్థిని వైష్ణవి 720 మార్కులకు గాను 509 మార్కులు సాధించింది. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని వైష్ణవి కళాశాల ప్రిన్సిపాల్ అంబటి వినోద్‌కుమార్ అభినందించారు. అనంతరం కళాశాల యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని ఉన్నత చదువుల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.