calender_icon.png 23 September, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుంకాలు విధింపు తర్వాత.. తొలిసారి భేటీ

23-09-2025 07:41:42 AM

న్యూయార్క్: భారత వస్తువులపై 50శాతం సుంకాలు, హెచ్-1 బీ వీసా(H-1B visa) రుసుముల పెంపుతో సహా అనేక అమెరికా చర్యల వల్ల దెబ్బతిన్న సంబంధాలను సరిదిద్దడానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్(S. Jaishankar) అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో(Marco Rubio) సమావేశమయ్యారు. 80వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (United Nations General Assembly) సందర్భంగా న్యూయార్క్‌లోని ఒక హోటల్‌లో ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఆందోళన కలిగిస్తున్న అంతర్జాతీయ అంశాలపై చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) 50 శాతం సుంకాలు విధింపు తర్వాత ఇరుదేశాల విదేశాంగ మంత్రులు తొలిసారి భేటీ అయ్యారు. పరస్పర ప్రాధాన్యత అంశాలపై పురోగతి సాధించేందుకు నిరంతరం సంప్రదింపులు అవసరం అన్నారు. భారత్- అమెరికా మధ్య సంప్రదింపులు కొనసాగుతాయని జైశంకర్ వెల్లడించారు. భారత్ -అమెరికా మధ్య వాణిజ్య చర్చలు(India-USTrade talks) తిరిగి ప్రారంభమైన వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అటు పీయూష్ గోయల్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం అమెరికాలో పర్యటిస్తోంది. వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు పీయూష్ బృందం అమెరికాకు వెళ్లింది.