calender_icon.png 23 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ప్రజలపైనే పాక్ బాంబుల వర్షం!

23-09-2025 01:37:52 AM

-30మంది మృతి.. పెద్ద సంఖ్యలో క్షతగాత్రులు?

-పాకిస్థాన్ వాయుసేన నిర్వాకం

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 22 : పాకిస్థాన్ వాయుసేన నిర్వాకానికి ఆ దేశానికే చెందిన ౩౦ మంది ప్రజలు మృతిచెందగా పెద్ద సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్ వాయుసేన సోమవారం తెల్లవారుజామున ఆ దేశంలోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో గల తిర్హా లోయలోని మాత్రెదారా గ్రామం పై దాడులు జరిపింది.

ఫైటర్ జెట్‌లు ఎల్‌ఎస్ రకం 8 బాంబులను జార విడవ డంతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ మీడియా చెబుతోంది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టాయి.

గతంలోనూ ఈ ప్రావిన్స్‌లో దాడులు..

పాక్ ఉగ్రావాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా గతంలో ఈ ప్రావిన్స్‌లో దాడులు చేసింది. నాడు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణా లు కోల్పోయారు. ఈ ఏడా ది జనవరిలో అంతకుముందు నెలతో పోలి స్తే ఉగ్రదాడులు 42శాతం పెరిగాయి. ఈ విషయాన్ని పాక్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్లిక్ట్ స్టడీస్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ గణాంకాలు చెబుతున్నాయి. బలోచిస్థాన్ తర్వాత అత్యధికంగా ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌లోనే.

పంజాబ్‌లో ఉగ్రవాదుల అరెస్ట్

ఆల్‌ఖైదా, ఐసిస్, టీటీపీ సంస్థలకు చెంది న 89మంది ఉగ్రవాదులను పంజాబ్ ప్రావిన్స్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ సోమవారం వెల్లడించింది. గడిచిన మూడు నెలల్లో ఇంటెలిజెన్స్ ఆధారంగా 940 ఆపరేషన్లు చేసి వీరిని అరెస్ట్ చేశామని పేర్కొంది. వారు ప్రావిన్స్‌లోని కీలక నగరాలు, భవనాలపై దాడులు చేసేందుకు ప్రణాళిక రచించి నట్లు ఆరోపించింది. 20కేజీల పేలుడు పదార్థాలు, 85డిటోనేటర్లు, ఫ్యూజ్ వైరును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.