calender_icon.png 14 July, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో జలజం విజయకేతనం

23-04-2025 12:50:04 AM

రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన జలజం కళాశాల విద్యార్థులు 

విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ ఎస్ రమేష్ గౌడ్ 

మహబూబ్ నగర్ ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : ఇంటర్ ఫలితాల్లో జిల్లా జిల్లా కేంద్రంలో కొలువుతీరిన జలజం జూనియర్ కళాశాల విద్యార్థులు కామర్స్, ఆరట్స్ గ్రూపులలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. జూనియర్ ఎంఈసి విభాగంలో 500 మార్కులకు గాను డి హృషికేశ్ రెడ్డి 489, చాహత్ అగర్వాల్ 488, జి నిశాంత్ 486, సిఈసి విభాగంలో ఎన్ సాహితి 489, జి వైష్ణవి 483, అబ్రహం 408, యం మణికంఠ 404, పి రణదీవ్ 391 మార్కులను సాధించి ఉత్తమ స్థానంలో నిలిచారు.

సీనియర్ ఎంఈసి విభాగంలో 1000 మార్కులకు గాను బి వినయ్ 979, బి శివకుమార్ 953, జుబేరియా ఫర్హత్ 938, సిఇసి విభాగంలో వేదిక బంగ్ 966, ఎన్ విద్యావతి 946, బి శివ నందు 945, హెచ్‌ఈసి విభాగంలో ఎన్ లక్ష్మీబాయి 951, వై అజయ్ 915, శ్రీ హర్షన్ 757 మార్కులను సాధించి జిల్లా కేంద్రంలో కామర్స్ ,ఆరట్స్ లాలో జలజం కళాశాల విద్యార్థులు తిరుగు లేని విజయాలను సొంతం చేసుకున్నారు. మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను జలజం కళాశాల కరస్పాండెంట్ ఎస్ రమేష్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ర్యాంకులు వచ్చేందుకు కృషిచేసిన అధ్యాపకులను వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండి షకీల్, అధ్యాపకులు కల్పన, ఆర్ కుసుమ కుమారి, రజిత, డి కృష్ణ, సి జ్యోతి, రహీమత్, ఎం పవన్, హనుమంతు, తదితరులు ఉన్నారు.