calender_icon.png 14 July, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

14-07-2025 02:17:07 PM

గాజులమండ్యంతిరుపతి జిల్లా(Tirupati District) గాజులమండ్యం పారిశ్రామికవాడలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. క్రోమో మెడికేర్ పరిశ్రమలో(Chrome Medicare Industry) రియాక్టర్ పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. సిబ్బంది సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమలో మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.