14-07-2025 01:49:42 PM
హన్వాడ: రోజురోజుకు పంచాయతీ ఆస్తులకు భద్రత లేకుండా పోతుంది. హన్వాడ మండలం(Hanwada mandal) కొత్తపేట గ్రామంలో వాటర్ ట్యాంకర్ కు ఉన్న రెండు టైర్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆశలే కదా మమ్మల్ని అడిగే వారెవరో అనుకున్నారో ఏమో తెలియదు కానీ దర్జాగా వాటర్ ట్యాంకర్ కు ఉన్న టైర్లను ఎత్తుకుపోయారు. గమనించిన గ్రామపంచాయతీ కార్యదర్శి గంగుబాయి హన్వాడ మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులపై సంబంధిత అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.