14-07-2025 01:29:32 PM
ఖమ్మం,(విజయక్రాంతి): డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు ఎడమ కాలువ అండర్ టన్నెల్(Paleru Left Canal Under Tunnel) నుంచి సోమవారం నీటిని విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అని రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ అమలు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వరి వేస్తే ఉరి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మద్దతు ధర క్వింటాకు రూ. 500 బోనస్ ఇచ్చామన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నిన రైతును రాజును చేయడానికి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రభుత్వం బోనస్ ఇస్తున్న సన్న వడ్లను రైతులు సాగు చేసుకోవాలని తెలిపారు.