calender_icon.png 14 July, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

14-07-2025 01:33:14 PM

నూతనకల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం పర్యటన సందర్భంగా సోమవారం మండల బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు(BRS leaders arrest) చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్న మల్లయ్య మాట్లాడుతూ అప్రజాస్వామిక అరెస్టుతో ప్రశ్నించే గొంతుకలను ఆపలేరన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.అరెస్టు చేసిన వారిలో మాజీ సర్పంచి చూడి లింగారెడ్డి,బత్తుల విద్యాసాగర్, ఉప్పుల వీరు యాదవ్,బత్తుల విజయ్, మహేష్,శ్రీశైలం తదితరులు ఉన్నారు.