14-07-2025 01:44:57 PM
హామీలు అమలు చేయకపోతే.. బరాబర్ నిలదీస్తాం,
హాలియా,(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్(Former MLA Nomula Bhagath) అన్నారు. సోమవారం నాడు అనుముల మండలంలోని వివిధ గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు 420 హామీలు అమలు చేయడంలో విఫలం అయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో ప్రజల నుండి త్రీవ వ్యతిరేకతను మూటకటుకుందన్నారు. ప్రజా రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రైతుల ఖాతాలో అరకొరగా డబ్బులను జమ చేసింది అన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులపై కార్యకర్తలపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. కార్యకర్తలకు అండగా ఉండి కాపాడుకుంటామన్నారు. సీనియర్ నాయకులు ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు వివిధ గ్రామాల మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.