21-09-2025 08:03:45 PM
కరీంనగర్ క్రైమ్ (విజయక్రాంతి): జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రవక్త మొహమ్మద్ జన్మదిన మాసాన్ని పురస్కరించుకొని 21 సెప్టెంబర్ 2025 ఉదయం 11 గంటలకు ఒక ప్రముఖ హోటల్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ అజరుద్దీన్. మహమ్మద్ ఫక్రుద్దీన్ జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సెక్రెటరీ షోహెబ్ అహ్మద్ ఖాన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ హైరుద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ దైవ ప్రవక్త మహమ్మద్ బోధనలు సమస్త మానవాళికి మార్గదర్శకత్వం మొహమ్మద్ కేవలం ముస్లింల దైవ ప్రవక్త కాదు వారు సమస్త మానవాళి కోసం వచ్చిన చిట్టచివరి దైవ ప్రవక్త వారి బోధనల ద్వారా ఒక ఉత్తమ సమాజాన్ని నెలకొల్పే అవకాశం ఉందని జమాతే ఇస్లామీ హింద్ భావిస్తుంది ఇదే ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని కరీంనగర్ శాఖ వారు కుల మతాలకు అతీతంగా ఒక మాసం వరకు ఉద్యమాన్ని కొనసాగించారు. ఉద్యమంలో గురుద్వారాలో సాయిబాబా మందిరంలో కుల సంఘాలు విద్యావంతుల సమావేశాలు రాజకీయ పార్టీల ముఖ్యులతో కలిసి ప్రవక్త మొహమ్మద్ బోధనలను తెలియజేయడం జరిగింది.
మరి సర్కస్ గ్రౌండ్లో సెప్టెంబర్ 19, 20, 21, 2025 ఒక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇందులో ఈ మూడు రోజుల్లో కుల మతాలకు అతీతంగా దరిదాపు 25 వేల మంది సందర్శకులు పాల్గొనడం జరిగింది 21వ తేదీన ఒక గొప్ప బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది జమాతే ఇస్లామీ హింద్ మానవసేవే మాధవసేవ భావిస్తుంది ఏ సమయంలో మానవులు బాధలు ఉంటే వారిని ఆదుకొనడానికి తన వంతు కృషిని చేస్తుంది జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ఆసుపత్రులు వడ్డీ రహిత సొసైటీలో ఇలాంటి మొదలు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది.