21-09-2025 07:58:49 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): చింతకుంట స్మశాన వాటికలో నిమగ్నమైన వినాయక విగ్రహాలను వేసిన కాంట్రాక్టర్లు దానిని చూసుకోవలసిన నగర పాలక సంస్థ అధికారులపై చట్టరీత్యా చర్య తీసుకొని తక్షణమే వాటిని తొలగించాలి లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని చింతకుంట గ్రామస్తుల డిమాండ్ చేశారు. చింతకుంటలోని స్మశాన వాటికలో హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా నిమగ్నమైన విగ్రహాలను ఎస్సారెస్పీ కెనాల్ నుండి తొలగించిన వాటిని స్మశాన వాటికలో పడేయడం హిందూ ప్రజలు అవమానించడమేనని దీనికి కారకులైన కాంట్రాక్టర్, నగరపాలక సంస్థ అధికారులపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా చింతకుంట గ్రామాల ప్రజల కోసం ఉన్న స్మశాన వాటికలో కరీంనగర్ నుండి ట్రాక్టర్ ద్వారా ఆటోల ద్వారా సేకరించిన తడి చెత్త పొడి చెత్తను డంపింగ్ యార్డ్ లో వేయకుండా స్మశాన వాటికలో వేయడం ద్వారా స్మశాన వాటిక మొత్తం చిత్తమయంగా దుర్వాసనతో నిండి ఉందని తెలిసిన వెంటనే చింతకుంట గ్రామానికి చెందిన భూక్య తిరుపతి నాయక్, గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, పెరుమళ్ళ కమల్ గౌడ్, లుక్కా విజయ్, పెరుమళ్ళ శ్యాం, వెంకట చారి, సాగర్ రెడ్డి బత్తిని సందీప్ తదితరులు పరిశీలించడం జరిగింది.
శనివారం రోజున చింతకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు మరణిస్తే దాన సంస్కార నిమిత్తం స్మశానవాటికలు తీసుకెళ్తే అక్కడ ఉన్న ఈ దుస్థితిని చూసి ప్రజలు ఒకేసారి అవాక్కయాలని ఇది చాలా బాధాకరమైన విషయమని కాళ్లు కూడా పెట్టలేని పరిస్థితిలో చెత్త వేయడం దింపుడు గళ్ళెం వద్ద వినాయక విగ్రహాల వెయ్యడం చూసి బాధపడ్డారని అక్కడ నిలబడలేని పరిస్థితిలో వాసనతో భరించలేక చనిపోయిన కుటుంబీకులే తాత్కాలికమైన ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసుకొని కొంత శుభ్రం చేయడం జరిగిందని ఇంత జరుగుతున్న నగర పాలక సంస్థ అధికారులు చూడకపోవడం శోచనీయమని చింతకుంట ప్రజలకు మనోభావాలను అనారోగ్యాల గురికావడానికి కారకులైన సదర్ కాంట్రాక్టర్లు మరియు నగరపాలక అధికారులపై తక్షణమే చర్యలు తీసుకొని వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మంగళవారం రోజున చింతకుంట ప్రజల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.