10-09-2024 12:54:57 AM
నటన, స్టుల్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు రజనీకాంత్. తాజాగా సూపర్‌స్టార్‌పై ఉన్న అభిమానాన్ని ఓ నటుడు వినూత్న రీతిలో చాటుకున్నాడు. తద్వారా ఏకంగా గిన్నిస్ రికార్డును, తలైవా ప్రశంసల్ని సొంతం చేసుకున్నాడు. నటుడు విఘ్నేశ్ దర్శకులు, నటులు, రజనీ వీరాభిమానులతో లైవ్ పాడ్‌కాస్ట్ నిర్వహిం చారు. సెప్టెంబర్ 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం 8న సాయంత్రం 8 గంటల దాకా కొనసాగింది. ఇలా 50 గంటల పాటు లైవ్ చేసినందుకు విఘ్నేశ్‌కు దర్శకుడు శశికుమార్ గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ అందజేశారు. ‘విఘ్నేశ్ మిమ్మల్ని ఎలా ప్రశంసించాలో అర్థం కావట్లేదు. ఏమివ్వాలో తెలియట్లేదు. ఎప్పటికీ మీరు నా హృదయంలో ఉంటారు. లవ్ యూ’ అంటూ రజనీ ఆనందం వ్యక్తం చేశారు.