calender_icon.png 25 May, 2025 | 4:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేన్స్‌లో జాన్వీ హొయలు

22-05-2025 12:47:29 AM

ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠాత్మక 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తార జాన్వీకపూర్ తొలిసారి తళుకులీనింది. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నెల 16న ప్రారంభమైన కేన్స్ ఫెస్టివల్స్ 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈసారి కేన్స్‌కు ఎంపికైన ఏకైన భారతీయ చిత్రం ‘హోమ్‌బౌండ్’. ఇందులో జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ సందర్భాన్ని పురస్కరించుకొని మూవీటీమ్‌తో కలిసి జాన్వీ ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. లేత గులాబీ రంగులో ఉన్న పొడవాటి గౌన్‌ను ధరించిన జాన్వీ రెడ్ కార్పెట్‌పై చిరునవ్వులు చిందిస్తూ హొయలు పోయింది. ఈ స్టైలిష్, ట్రెడిషనల్ లుక్‌తో తన తల్లి శ్రీదేవిని గుర్తుచేయడమే కాక భారతీయ సంప్రదాయాన్ని చాటింది.

పొడవాటి గౌన్‌తో జాన్వీ కాస్త ఇబ్బందులు పడటం గ్రహించిన దర్శకుడు నీరజ్, నటుడు ఇషాన్ ఖట్టర్ ఆమె దుస్తులను మోస్తూ సాయం చేశారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన ఈ మెటాలిక్ పింక్ గౌను కోసం 3.4 లక్షలు ఖర్చయిందట.