calender_icon.png 25 May, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే చిత్రమిది

22-05-2025 12:46:06 AM

రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. రూపేశ్, ఆకాంక్ష సింగ్ నాయకానాయికలుగా రూపొందిన చిత్రం ‘షష్టిపూర్తి’. పవన్‌ప్రభ దర్శకత్వంలో రూపేశ్ నిర్మిస్తు న్నారు. ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానున్న నేపథ్యంలో హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన విశేషాలివీ.. “కథ విన్న వెంటనే ఒప్పుకు న్నా. ఇప్పుడు ఇలాంటి కథలు అవసరం.

ఈ చిత్రంలో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తా. జానకి అనే టెంపుల్ ట్రెజరర్ పాత్ర నాది. ఇది రెగ్యులర్ హీరోయిన్ పాత్ర లా ఉండదు. నా కారెక్టర్ లో ఎన్నో షేడ్స్ ఉంటా యి. ఇందులో షష్టిపూర్తి గురించే కాదు. అన్ని అంశాలూ ఉంటాయి.   ఇంతకుముందు ‘బెంచ్‌లైఫ్’లో రాజేంద్రప్రసాద్‌తో కలిసి పని చేశా. ఎంతో నేర్చుకున్నా. మేమిద్దరం ఎప్పుడూ గ్లిజరిన్ వాడలేదు.

ఎమోషనల్ సీన్స్‌ను సహజం గానే రక్తి కట్టించేవాళ్లం. ‘షష్టిపూర్తి’ కోసం పనిచేస్తున్నప్పుడు యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టు అనిపించింది.  నన్ను ఓ మంచి నటిగానే అంతా గుర్తు పెట్టుకోవాలని.. మంచి పాత్రలు, కథల్ని ఎంచుకున్నా.

ఈ సినిమాతో ఇంకా మంచి పేరొస్తుంది. కథ, పాత్ర నచ్చితే ఓటీటీ అయినా చేస్తా.  ప్రస్తుతం యాక్షన్ మూవీ చేస్తున్నా. తమిళంలో ఇంకో సినిమా కూడా.  తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే సినిమా ఇది. షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తుకువచ్చారు. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.. వారిని ప్రేమించండి.