calender_icon.png 25 May, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో పెద్ది యాక్షన్

23-05-2025 12:00:00 AM

రామ్‌చరణ్ కథానాయకుడి గా నటిస్తున్న తాజా పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్‌షాట్ పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ దేశవ్యాప్తంగా హ్యుజ్‌బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి టీమ్ ఓ అప్‌డేట్ ఇచ్చింది.

లెన్తీ క్రూషియల్ షెడ్యూల్ హైదరాబాద్‌లోని మ్యాసీవ్ విలేజ్ సెట్‌లో ప్రారంభమైందని తెలిపింది. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా నేతృత్వంలో ఈ సెట్‌ను నిర్మించారు. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్, టాకీ పోర్షన్‌ను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి కాగా, తాజా షెడ్యూల్‌తో సినిమా ఓ కీలక దశను చేరుకోనుంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ రస్టిక్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు.

ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి డీవోపీగా ఆర్ రత్నవేలు పనిచేస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సినిమా 2026, మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.