calender_icon.png 5 May, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విభేదాలు లేవు... అభివృద్దే మా ఎజెండా

05-05-2025 08:31:13 AM

ఎప్పుడు పార్టీ మారలేదు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల తో కలసి పని చేస్తున్నానని తనకు ఎవరితో ఎలాంటి విభేదాలు లేవని అందరి లక్ష్యం ప్రజలకు సేవ చేయటమే అని  ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు.  తాను ఎంపీగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది సందర్భంగా ఆదివారం ఖమ్మం లో విలేకరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నానని, ఎన్నడూ పార్టీ మారలేద న్నారు.  వారంలో 2 నుంచి 3 రోజులు ఖమ్మం లోనే అందుబాటులో ఉంటున్నానని పలు అభివృధి కార్యక్రమాలల్లో మంత్రులతో కలసి పాల్గొంటునన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో సన్న బియ్యం ఏ రాష్ట్రం లో ఇవ్వడము లేదని, ఒక్క తెలంగాణ లో మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. రాజీవ్ యువ వికాసం తో కొన్ని వేల మందికి లబ్ది చేకూర నుందన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వేలకోట్లతో పేదలకోసం సంక్షేమ పథకాలు చేపడుతున్న దని తెలిపారు.

రెండు జిల్లాలో అనేక రైల్వే రూట్ సమస్యలు ఉన్నవని వాటి పరిష్కారం కోసం ఉన్నతాధికారుతో చర్చించానన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులకు నష్టం వాటిల్లాదని  అధికారులతో మాట్లాడి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లా కేంద్రంలో వున్న అస్పత్రి లో 100 పడకలే ఉన్నదని, పక్కన వున్న చిన్న జిల్లా కేంద్రం ఐన మహబూబాబాద్ లో 150 పడకలతో అస్పత్రి ఉన్నదని మంత్రి తుమ్మలతో చర్చించి ఆరోగ్య శాఖ మంత్రిని ఇక్కడకి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రజలకు పూర్తి స్థాయి లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పారష్కారం కోసం కృషి చేస్తానన్నారు అనంతరం విలేకరులు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఎం పి దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విలేకరుల ప్రధాన సమస్య ఐన జిల్లా కేంద్రం లోని ఇళ్ల స్థలాల కేటాయింపు గురుంచి ఎం పి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కారం కోసం పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.