calender_icon.png 28 August, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదంలో జవహర్ నవోదయ విద్యార్థులు..?

28-08-2025 10:05:12 AM

600 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించాలి.

నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar Project)లోని 24 వరద గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో అచ్చంపేట శివారులోని జవహర్ నవోదయ(Jawahar Navodaya students) విద్యాలయ, మోడల్ స్కూల్ హాస్టల్ లో ఉన్న  సుమారు 600  మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సార్ మండల కేంద్రం నుండి జవహర్ నవోదయ విద్యాలయానికి వెళ్లి బ్రిడ్జిపై మంగళవారం ఉదయం నుండి రాకపోకలు నిలిచిపోయాయి. దానికి తోడు బ్రిడ్జిపై నుండి వరద ప్రవహములంతో బ్రిడ్జి దెబ్బతిని కూలిపోయే అవకాశం ఉంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.